7, మే 2009, గురువారం

కొంచెం ఆలోచించండి రాహుల్ గాంధీ గారు....!

మొన్నక సారి, ఎన్నికల ప్రచార సభలో ఎక్కడో సరిగ్గా గుర్తులేదు గాని, మన ప్రియతమ యువ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, మన భారతదేశం లో ఉన్న ఒకే ఒక సమస్య పేదరికం, దానిని నిర్మూలించటానికి తానూ శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. చాలా మంచిది. కాని పేదరికం ఒక్కటేనా మన భారతదేశం లో ఉన్న సమస్య.?

అవినీతి,
నిరుద్యోగం,
కుల మత ఘర్షణలు,
ప్రాంతీయవాద ఘర్షణలు,
పెరిగిపోతున్న జనాభా,

నియంత్రణ లేని ధరల పెరుగుదల, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,

కనీస ప్రమాణాలు కూడా లేని విద్య, మారుమూల ప్రాంతాల్లో పేదవాళ్ళకు అందని కనీస ప్రాధమిక విద్య,

కనీస సౌకర్యాలు లేని ప్రదేశాలు మన దేశం లో ఎన్నో వున్నాయి, పెరుగుతున్న మానవ వనరుల వలసలు,

సరిహద్దు దేశాల దాడులు, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉగ్రవాదం మరియు నక్సలిజం,

ఇవ్వన్నీ మన భారతదేశం లో వున్న సమస్యలు కాదా..?
మన దేశం లో ఇన్ని సమస్యలు పెట్టుకుని పేదరికం ఒక్కటే మన దేశంలో వున్న సమస్య అనటం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కొంచెం ఆలోచించండి రాహుల్ గాంధీ గారు....!
ఇకనైనా మన రాజకీయ నాయకులు అన్ని సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిద్దాం. :) :)

1 కామెంట్‌:

  1. "ఇకనైనా మన రాజకీయ నాయకులు అన్ని సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిద్దాం"
    వీళ్ళే మనకు అసలు సమస్య.వీళ్ళు మన సమస్యలను పరిష్కరిస్తారని ఆశించడం మన భ్రమే.సృష్టించకపోతే అదే మహాభాగ్యం.

    రిప్లయితొలగించండి