ఎన్నికలు అయిపోయినవి,
ఇంకా 10 రోజులు ఆగితే మన రాజకీయ నాయకుల మరియు మన రాష్ట్ర భవితవ్యం తెలుస్తుంది. ప్రజలు మార్పుని కోరుకుంటున్నారా లేక కలర్ T.V లని కోరుకుంటున్నారా , లేకపోతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి నమ్మారా అనేది కూడా తెలుస్తుంది.
ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి మన రాష్ట్రంలో ముక్కోణపు పోటి జరిగింది.ఎన్నికలు జరిగేంత వరకు అన్ని పార్టీల వాళ్ళు కూడా మిగిలని పార్టీల వాళ్ళని తిట్టారు మరియు కొట్టుకున్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలపై వాళ్ళు ఒక వైపు ధీమాగా వున్నారు ఇంకొక వైపు అనుమానం గాను వున్నారు. మొన్నటి వరుకు మెజారిటీ మాకే వస్తుంది అని చెప్పుకున్నారు, ఇప్పటికీ చెప్పుకుంటున్నరనుకోండి, కాకపోతే హంగ్ గురించి కూడా అన్ని ప్రాధాన పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత నిజంగా హంగ్ ఏర్పడితే ఎవరు ఎవరితో కలుస్తారనేదే గమనిఅంచవలసిన అంశం, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నెన్ని తిట్టుకున్నారో, విమర్శించుకున్నారో వాళ్ళకే తెలియదు, ఇవన్ని మర్చిపోయి కలసిపోతారా? ఏమో అధికారం కోసం కలిసినా కలసిపోతారు!!
అప్పుడే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టిలు ప్రజారాజ్యంతో కలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయంట!.చిరంజీవి కి రాజకీయ అనుభవం లేదు, సొంత ఊరికి ఏమి చెయ్యలేదు అని అన్న వాళ్ళు ఎలా కలుపుకోవాలనుకుంటున్నారో తెలుయదు. ఇప్పటి వరుకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసాం, అవినీతిలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం నాయకులు ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు అని చెప్పిన చిరంజీవి ఎలా కలుస్తారోమరి?
ఏదిఎమైనా ఫలితాలు వచ్చేవరకు ఆగవలసిందే.
5, మే 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి