కక్కుర్తి బెర్తులు... అంటే ఏంటో తెలుసా. రైలు భోగిల్లో, రైల్వే శాఖ ప్రవేశపెట్టిన side middle బెర్త్. ఆ బెర్త్ కి ఈనాడు వారు చేసిన నామకరణం కక్కుర్తి బెర్తులు. ఒకరకంగా కక్కుర్తి బెర్త్ అనే పదం సరిగ్గా సరిపోతుంది. ఈ సైడ్ మిడిల్ బెర్త్ ప్రవేశపెట్టినప్పుడు రైల్వీశాఖ వారు ఏమి చెప్పారో తెలుసా, ప్రయాణీకుల సౌకర్యార్ధం వారికీ ఎక్కువ సీట్లు లభించడం కోసం, దూరప్రయాణం చేసే ప్రయాణికులు సుఖంగా నిద్రించి ప్రయాణం చేయటం కోసం ఈ ఏర్పాటు చేసాం అని చెప్పటం జరిగింది. చాల ఇరుకుగా వుండే ఆ బెర్త్ లో సుఖ నిద్ర ఎలా పడుతుందో మరి ఆ అధికారులకే తెలియాలి. ఈ బెర్త్ వల్ల జరిగిన ఇంకొక అపకారం ఏంటంటే side upper బెర్త్ లో వున్నవాళ్ళకి కూడా సరిగా నిద్ర పట్టదు. కావున ఒక side middle బెర్త్ ఏర్పాటు చేయటం వల్ల చెడింది ఇద్దరు.
ప్రయాణీకులని ఇబ్బంది పెట్టే ఈ ఆలోచన మన రైల్వే అధికారులదా లేక లాలు ప్రసాద్ గారిదా?? ఎవరిడైతేనేమి ఇది రైల్వే వారి ఆలోచనా రాహిత్యానికి ఒక నిదర్శనం. ఒకసారి లాలు గారిని ఆ బెర్త్ లో ప్రయాణం చేయమని చెప్పాలి, అప్పుడు ఆయనికి ప్రయాణీకుల ఇబ్బంది తెలిసివచ్చేది.
బెర్త్‌లు సరిపోకపోతే ఇంకొక భోగి పెంచటమో లేక పోతే వీలుని బట్టి ఆ మార్గం లో ఇంకొక రైలు పెంచటమో చెయ్యాలి గాని ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు కాదు. అయినా కొత్త రైళ్ళు భిహార్ కే సరిపోవటం లేదు ఇక మిగిలిన రాష్ట్రాలకేమిస్తారు.
ఇప్పుడు అందరికి శుభవార్త ఏంటంటే ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని, ఈ కక్కుర్తి బెర్తుల తొలగింపు చర్య మొదులు పెట్టారు మన రైల్వే వారు, దేవుడా ఇప్పటికైనా మా మీద నీకు దయ కలిగింది సంతోషం, అలాగే రైల్వే వారికి కృతజ్ఞతలు మరియు శతకోటి నమస్కారాలు.
ఈ కక్కుర్తి బెర్త్ ల వల్ల బాగుపడింది ఎవరంటే, వాటిని అమర్చిన కాంట్రాక్టర్లు, కంపెనీలు. ఇంతకాలం ఇబ్బంది పడింది మాత్రం ప్రయాణికులు.
ఈ తొలగింపు తొందరగా పుర్తికావాలని కోరుకుంటూ..... ధన్యవాదాలు :) .
6, మే 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పీకేసుడులో కూడా కాంట్రాక్టర్లు,అధికారులు బాగుపడతారులేండి :-)
రిప్లయితొలగించండిఅవునండీ, ఈనాడు వాళ్ళు భలే పేరు పెట్టారు.చూడగానే భలే నచ్చేసింది.మొదటిసారి ఆ బెర్తు చూసినపుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అదృష్ట వశాత్తూ నాకు ఎప్పుడూ ఎలాట్ కాలేదు.అసలు సైడు లోయరే నరకం అనుకుంటే ఇది మరీ అన్యాయం.
రిప్లయితొలగించండిమొత్తానికి పీడా వదిలింది.
టైముంటే ఒక సారి ఇది చూడండి.
http://manishi-manasulomaata.blogspot.com/2008/08/blog-post_12.html
పానిపూరి గారు:: బాగా చెప్పారు, కాని ఈ సారి ప్రయాణికులకి ఇబ్బంది వుండదని ఆశిద్దాం.
రిప్లయితొలగించండిసుజాత గారు:: నాకు రెండు మూడు సార్లు సైడ్ బెర్త్ ల్లో ప్రయాణం చేయవలసి వచ్చింది, అదేంటో ఈరోజు టికెట్ బుక్ చేస్తే అది సైడ్ అప్పెర్ బెర్త్ వచ్చింది, ఆఖరి సమయంలో బుక్ చేసినందుకు అని సరిపెట్టుకోవాలి.
పీడా పోయింది కాని అవి అన్ని రైళ్ళలో తొలగించటానికి ఇంకా రెండు నెలలు పడుతుందంట, రైల్వే వాళ్ళు వేసవి రద్దీని సొమ్ము చేసుకోవలిగా.
మీ "నాకు సైడ్ లోయర్ బెర్తు ఎందుకొద్దంటే.....!" చూసాను బాగా రాసారు, నాకు కూడా సైడ్ బెర్త్ అంటే ఇష్టం వుండదు.
మొన్న ఇండియా ట్రిప్పులో ముందు ప్లానింగ్ లేక అప్పటికప్పుడు రైలు ప్రయాణాలు పడి అన్ని సార్లూ దీనికే బలయ్యాము.అదో నరకం.శుభవార్త చెప్పారు.వచ్చే ఏడు కాస్త సుఖ ప్రయాణం ఆశించవచ్చన్న మాట.
రిప్లయితొలగించండి